దేశంలో కరోనా తగ్గుముఖం..

125
corona
- Advertisement -

దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,788 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773కు చేరింది. ఇందులో 1,02,11,342 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

మరో 1,52,419 మంది మహమ్మారి వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం 8 గంటల వరకు కొత్తగా 14,457 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌ వల్ల మరో 145 మంది మృతిచెందారని వెల్లడించింది. 2,08,012 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

- Advertisement -