దేశంలో 24 గంటల్లో 20,021 కరోనా కేసులు

60
covid 19

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 2 లక్షలకు చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,021 కరోనా కేసులు నమోదుకాగా 279 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,02,07,871కి చేరాయి. 97,82,669 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 1,47,901 మంది మరణించారు. గత 24 గంటల్లో 21,131 మంది కరోనా నుండి కోలుకున్నారు.