24 గంటల్లో 18,653 కేసులు..507 మంది మృతి

18
corona in delhi

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 18653 కరోనా కేసులు నమోదుకాగా 507 మంది మృతిచెందారు.

ఇక ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58593కి చేరగా 17400 మంది మృత్యువాత పడ్డారు.2,20,114 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,47,979 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.

గత 24 గంటల్లో 2,17,931 టెస్టులు నిర్వహించగా 18522 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. జూన్‌ 30 వరకు 86,26,585 పరీక్షలు చేశామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటించింది.