దేశంలో 30 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

183
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 70 వేలకు చేరువలో కేసులు నమోదవుతుండగా 30 లక్షలకు చేరువయ్యాయి కరోనా కేసులు.

గత 24 గంట‌ల్లో 68,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 945 మ‌ర‌ణించారు. దీంతో ఇప్పటివరకు 29,75,702 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 6,97,330 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో 55,794 మంది మృత్యువాతపడ్డారు. 22,22,578 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.

ఆగ‌స్టు 21న దేశ‌వ్యాప్తంగా 10,23,836 మందికి క‌రోనా ప‌రీక్షలు చేశామని….నిన్న‌టివ‌ర‌కు 3,44,91,073 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది ఐసీఎంఆర్.