మ్యాన్ వర్సెస్ వైల్డ్…బేర్ గ్రిల్స్‌తో అక్షయ్‌!

397
akshay kumar

డిస్క‌వ‌రీ ఛానెల్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో ఓ కార్య‌క్ర‌మం ప్ర‌సారం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ ప్రముఖులను కూడా తన వెంట కొండకోనల్లో, దట్టమైన అరణ్యాల్లో తిప్పుతూ చేసే అడ్వెంచరస్ కార్యక్రమం ‘ఇంటూ ద వైల్డ్’. డిస్కవరీ చానల్ కోసం తానొక్కడే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ పేరిట సింగిల్ ఎపిసోడ్లు రూపొందించే బేర్ గ్రిల్స్ అప్పుడప్పుడు వరల్డ్ సెలబ్రిటీలను తన వెంటేసుకుని తిప్పుతూ ‘ఇంటూ ద వైల్డ్’ పేరిట స్పెషల్ డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తుంటాడు. ఇప్పటికే ఈ షోలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొనగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ కూడా చేరారు.

దీనికి సంబంధించిన ప్రోమోను అక్షయ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. నేను పిచ్చివాడిని అనుకుంటున్నారా… కానీ పిచ్చివారు మాత్రమే అడవిలోకి వెళ్తారు అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.