దేశంలో 70 లక్షలు దాటిన కరోనా కేసులు…

150
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 70 వేలకి పైగా కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,383 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 918 మంది మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 8,67,496 యాక్టివ్ కేసులుండగా మొత్తం కేసుల సంఖ్య 70,53,807కు చేరుకున్నాయి. 60,77,977 మంది కరోనా నుండి కోలుకోగా 1,08,334 మంది మృతిచెందారు.

దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 86.17 శాతానికి పెరగగా మరణాల రేటు 1.54 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో 10,78,544 కరోనా టెస్టులు చేయగా ఇప్పటివరకు 8,68,77,242 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.