రాష్ట్రంలో 24 గంటల్లో 1,717 కరోనా కేసులు…

78
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,717 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5గురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు 2,12,063 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 25,713 యాక్టివ్ కేసులుండగా 1,85,128 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,222 మంది మృతిచెందారు. జీహెచ్‌ఎంసీలో 276 నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్‌లో 131, కరీంనగర్‌లో 104, నల్గొండలో 101 అత్యధికంగా నమోదు అయ్యాయి.

దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.57 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు దేశంలో 85.9 శాతంగా ఉంటే రాష్ట్రంలో 87.29 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.