దేశంలో 65 లక్షలు దాటిన కరోనా కేసులు…

159
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 75,829 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 940 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 65,49,374కు చేరాయి.

55,09,967 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా 9,37,625 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 1,01,782 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.

దేశంలో నిన్న ఒక్క‌రోజే 11,42,131 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు మొత్తం 7,89,92,534 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ఐసీఎంఆర్ వెల్లడించింది.