14 లక్షల 35 వేలకు చేరిన కరోనా కేసులు…

153
india coronacases

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 14 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 49,931 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 708 మంది మృత్యువాతపడ్డారు.

ఇప్పటివరకు దేశంలో 14,35,453 కరోనా కేసులు నమోదుకాగా 32,771 మంది మృతిచెందారు.ఇక ప్రస్తుతం దేశంలో 4,85,114 యాక్టివ్ కేసులు ఉండ‌గా కరోనా మహమ్మారి నుండి 9,17,568 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో 1,68,06,803 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా నిన్న ఒక్కరోజే 5,15,472 టెస్లులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.