47 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

167
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు 46 లక్షల కేసులు దాటాయి.

గత 24 గంటల్లో దేశంలో 97,570 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1201 మంది ప్రాణాలు కొల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,59,985కు చేరగా 77,472 మంది ప్రాణాలు కొల్పోయారు.

ప్రస్తుతం 9,58,316 యాక్టివ్‌ కేసులు ఉండగా 36,24,197 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 5.5 కోట్లు దాటాయి.