24 గంటల్లో 2278 కరోనా కేసులు…

135
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24గంటల్లో 2,278 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,54,880కి చేరాయి.

కరోనాతో ఇప్పటివరకు 950 మంది మృతిచెందగా 1,21,925 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,005 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.గ్రేటర్‌ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 331, రంగారెడ్డి 184, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 150, నల్గొండ 126, కరీంనగర్‌ 121, వరంగల్‌ అర్బన్‌ 91, ఖమ్మం 98 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతం ఉండగా, దేశంలో 1.66 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటికీ 20,78,695 నమూనాలను పరిశీలించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.