29 లక్షలు దాటిన కరోనా కేసులు..

151
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రోజుకు 70 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య 29 ల‌క్ష‌ల మార్కును దాటాయి.

గ‌త 24 గంట‌ల్లో 68,898 పాజిటివ్ కేసులు నమోదుకాగా 983 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 29,05,824కు చేరగా 54,849 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా మహమ్మారి నుండి 21,58,947 మంది కోలుకోగా 6,92,028 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఆగ‌స్టు 20 వరకు 3,34,67,237 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని గత 24 గంటల్లో 8,05,985 కరోనా టెస్టులు చేశామని ఐసీఎంఆర్ వెల్లడించింది.