సెప్టెంబర్ 5న నాని ‘వి’ రిలీజ్…కారణం తెలుసా!

184
nani v

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం వి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది.

ఓటీటీలో సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో వి రిలీజ్ కానుందని సమాచారం. అయితే ఈ తేదీనే నాని విడుదల కావడానికి ప్రధాన కారణం ఏంటంటే నాని నటించిన తొలిచిత్రం అష్టాచమ్మా సెప్టెంబర్‌ 5..2008లో విడుదలైంది.

నాని సినిమా ప్రయాణం పూర్తయి 12 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ తేదీనే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. నాని సరసన నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటించగా సుధీర్ బాబు కీ రోల్ పోషించారు. ఇక నాని ప్రస్తుతం టక్ జగదీశ్, శ్యామ్ సింగరాయ్ అనే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.