రెండో వన్డేలో భారత్ ఘనవిజయం..

36
ind

శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఓటమి తప్పదనుకున్న తరుణంలో దీపక్ చాహర్ చేసిన మ్యాజిక్‌తో భారత్‌ గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. లంక విధించిన 276 పరుగుల లక్ష్యాన్ని 49.1 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి చేధించింది.

భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పృథ్వీ షా (13), ఇషాన్‌ కిషన్‌ (1), శిఖర్‌ ధావన్‌ (29; 6 ఫోర్లు) త్వరగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను పాండే, సూర్యకుమార్‌ తీసుకున్నారు. అయితే మనీశ్‌ పాండేను (31 బంతుల్లో 37) చేసి పెవిలియన్ బాటపట్టగా హార్దిక్‌ (0) కూడా విఫలమయ్యాడు. కృనాల్‌ (35), సూర్యకుమార్‌ హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌ కు తోడుగా సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్‌ (3/50), భువనేశ్వర్‌ (3/54), దీపక్‌ చహర్‌ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.