మరో రెండు రోజులు భారీవర్షాలు..

178
rains

రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

వాతావ‌ర‌ణంలో భారీ మార్పులు చోటు చేసుకోవ‌డంతో పాటుగా రుతుప‌వ‌నాలు చురుగ్గా సాగుతుండ‌టంతో వ‌ర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ ,ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంక‌లు, జ‌లాశ‌యాలు నిండుకుండ‌లా మారాయి. ఇక ఏపీలో కూడా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి.

నేడు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని,అలాగే, నిర్మల్, నిజామాబాద్, కరీనగర్, ఉమ్మడి వరంగల్, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.