తాను ఏ రాజకీయ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. ఓ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరినా మూడు నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేనని చెప్పారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉండాలో తెలుసని, కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. బెంగళూరులో తన బాల్యం గడిచిందని,
అందుకే అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
బీజేపీ పార్టీ అనేది నీతిలేని వ్యక్తులతో కూడిన సమూహమని ప్రకాశ్‌రాజ్ విమర్శించారు. వారు గోమాతను పూజిస్తామని చెప్పుకొంటారని, కానీ గోవుల్ని పూజిస్తూ జరుపుకొనే మకర సంక్రాంతి రోజున మాత్రం ఇళ్లల్లో ఉండకుండా క్యాంప్‌లకు పోతారని ఎద్దేవా చేశారు. నిజాయితీగా లేని వ్యక్తులపై కోపం ఉందని పేర్కొన్నారు.