త్వరలో ఎఫ్‌ 3..రాబోతుంది

238
f2 successmeet
- Advertisement -

సంక్రాంతి రేసులో విడుదలై సక్సెస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న చిత్రం ఎఫ్‌ 2. వెంకటేష్,వరుణ్ తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లవైపు పరుగులు పెట్టిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ ఏర్పాటు చేసింది చిత్రయూనిట్.

ఈ సందర్భంగా మాట్లాడిన హీరో వెంకటేష్‌ పదేళ్ల తర్వాత థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల స్పందనని చూశానని… అందరూ నవ్వుతున్నారు కానీ నాకు కళ్లలో నీళ్లొచ్చాయి. కష్టపడి ఒక సినిమా చేశాక, దాన్ని ప్రేమగా ప్రేక్షకులు చూస్తున్నప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుందన్నారు.
నా సినిమాలు ఎన్నో సంక్రాంతికి వచ్చి విజయవంతమయ్యాయి. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇలాంటి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు.

తనకు కామెడీ అంటే చిరంజీవి, వెంకటేష్‌ సినిమాలే గుర్తుకొస్తాయని చెప్పారు హీరో వరుణ్ తేజ్‌. ప్రేక్షకుల అభిమాన కథానాయకుడు ఎవరైనా వాళ్లందరికీ నచ్చే వ్యక్తి వెంకటేష్‌ సర్‌. త్వరలోనే ‘ఎఫ్‌3 ’చేయబోతున్నాం. అది మరింత నవ్విస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి, అనసూయ, అన్నపూర్ణమ్మ, రజిత, ప్రదీప్‌, కిరణ్‌, సురేష్‌, కాసర్ల శ్యామ్‌, శ్రీమణి, బాలాజీ, సురేందర్‌, సమీర్‌రెడ్డి, తమ్మిరాజు, ఎ.ఎస్‌.ప్రకాశ్‌, సాయికృష్ణ, ప్రవీణ్‌, మాధవ్‌, రత్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -