ఈ గ్రామపంచాయతీలో భార్యల స్థానంలో భర్తల పెత్తనం..

155
- Advertisement -

సమాజంలో మహిళ సాధారికథను పెంపొందించి, వారికి ప్రత్యేక రిసర్వేషన్ ఇచ్చి అధికారం కల్పించిన భార్యల పదవులు, భర్తల పెత్తనం ఇంక పోవట్లేదు, గ్రామసభలో వార్డ్ మెంబెర్ భార్య స్థానంలో భర్తలు హాజరవ్వటమే కాకుండ, వారి సంతకాలు సైతం వీరే పెట్టి అధికారం చెలాయిస్తున్న వైనం ఇంద్రేశం గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు వార్డ్ సభ్యులు మహిళల స్థానంలో వారి భర్తలు హాజరు అయ్యి వారే వార్డ్ మెంబర్ల లాగ అధికారం చాలాయించడమే కాక భార్యల సంతకాలను పెడుతుండడం, పంచాయతికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో భార్య స్థానంలో భర్తలు పెత్తనం చేలాయించడం, ఈ రోజు సభకు హాజరైన జిల్లా పంచాయతి అధికారి దృష్టికి వచ్చి, పంచాయతి కార్యదర్శి చేత నోటీసులు ఇప్పించారు. మళ్ళీ ఇలాంటి గటన పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతి కార్యదర్శి తెలిపారు.

- Advertisement -