గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి

38
minister ik reddy

నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామలలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, మరుగు దొడ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని.. ప్రతి గ్రామ పంచాయితీకి పల్లె ప్రగతిలో భాగంగా ట్రాక్టర్‌ను ఇచ్చిందని గ్రామ అభివృద్ధికి నెల నెల ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు.

కరోనా కష్ట కాలంలోనూ రైతులకు ప్రభుత్వం రైతు బంధు ఇస్తుందని ఈ నెల 27 నుండి యాసంగి రైతు బంధు నిధులు విడుదల చేస్తారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని.. రైతుల కోసం దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలోనే ఉన్నాయని మంత్రి అన్నారు. అనంతరం కొండాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు పల్లవి, ప్రణయని మెడిసిన్‌లో 3796, 3812 ర్యాంకులు సాధించినందుకు మంత్రి వారిని శాలువతో సన్మానించారు.