అనురాగ్ యూనివర్సిటీ ముందు ఏబీవీపీ ధర్నా..

16
abvp

తెలంగాణ రాష్ట్రంలో కోవింద్ కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం దృశ్య జనవరి 8 నుండి 16 వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జీవో జారీ చేయడం జరిగింది… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ మార్గదర్శకాలు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి యధావిధిగా ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.

అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం పై ప్రశ్నించిన ఏబీవీపీ విద్యార్థి నాయకుల పై అమానుషంగా దాడి చేసి పోలీసులచే అరెస్టు చేయించి విద్యార్థుల నాయకులపై అక్రమ కేసులు పెట్టిన అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం తో పాటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు ఏబీవీపీ నాయకులు. అనురాగ్ యూనివర్సిటీ ముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి వెళ్లిన ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు ఘట్ కేసర్ పోలీసులు.