- Advertisement -
ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 84 కోట్ల విలువ చేసే 12 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు DRI అధికారులు. జింబాబ్వే ప్రయాణికురాలి వద్ద డ్రగ్స్ గుర్తించింది DRI బృందం.
విశ్వసనీయ సమాచారం మేరకు ముంబాయి ఎయిర్ పోర్ట్ లో మాటు వేశారు అధికారుల బృందం. హెరాయిన్ ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి…….ఫైల్ ఫోల్డర్ మద్య లో దాచి తరలించే యత్నం చేసింది కిలాడి లేడి. నిందితురాలి వ్యవహార శైలి లో అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు అధికారులు.
అధికారులు తమదైన శైలీలో విచారణ జరుపగా ఫైల్ ఫోల్డర్ లో దాచిన హెరాయిన్ గుట్టు ను రట్టు చేసింది DRI.నిందితురాలి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది DRI.
ఇవి కూడా చదవండి..
- Advertisement -