త్రిపుర అసెంబ్లీ పోలింగ్ అప్‌డేట్..

32
- Advertisement -

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ సందర్భంగా కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

త్రిపురలో మొత్తం 28.13లక్షల మంది ఓటర్లు ఉండగా 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ – ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ), సీపీఎం – కాంగ్రెస్ కూటములతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన తిప్రామోథా ప్రధాన పోటీదారులుగా బరిలో ఉన్నాయి. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తుంది.

సీపీఐ (ఎం) 47 స్థానాల్లో పోటీ చేయగా, దానికూటమి భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక తిప్రామోథ 42 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా, 58 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -