భూముల వేలం ప్రక్రియ ఆపేయాలి:గెల్లు

17
- Advertisement -

నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరియు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.

రేవంత్ రెడ్డి వేలం వేస్తున్నది HCU భూములను కాదు, హైదరాబాద్ ఊపిరితిత్తులను.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం HCUకి 2300 ఎకరాల భూమిని ఇస్తే, నేడు అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూములను అమ్మడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు. పాలన చేతకాక, పన్నులు రాబట్టక, భూములను అమ్మి జీతాలు ఇవ్వాలని చూస్తున్న రేవంత్ రెడ్డి, ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “ప్రభుత్వ భూమి ఒక గుంట కూడా అమ్మకుండా చూస్తాం” అని చెప్పి, నేడు యూనివర్సిటీ భూములు ఎలా అమ్ముతున్నాడు..?, ఉద్యోగాలు భర్తీ చేయడం, పథకాలు ప్రజలకు అందించడం చేతగాక, ఈరోజు భూములను కాపాడాలని నిరసన తెలియజేసిన విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్రంలో ఒక నిర్బంధకాండ కొనసాగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.

నాడు యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోతే రెండుసార్లు వచ్చిన రాహుల్ గాంధీ, ఈ రోజు విద్యార్థులపై దాడి జరుగుతుంటే కనీసం స్పందించడం లేదు… ఎందుకో?, ప్రజాస్వామ్య వాదులారా, పర్యావరణ రక్షకులారా… ఈరోజు యూనివర్సిటీ భూములను కాపాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
భూముల వేలం ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి… విద్యార్థుల మీద పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ధర్నాలు, రాస్తారోకోలు చేపడతాం అని హెచ్చరించారు.

Also Read:విశ్వంభర.. క్లారిటీ వచ్చేనా!

- Advertisement -