మెగా డీఎస్సీపై ఏపీ సీఎం చంద్రబాబు

18
- Advertisement -

మెగా డీఎస్సీపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బాపట్ల జిల్లాలోని కొత్త గొల్లపాలెంలో న్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు..ఏ ప్రిల్‌లోనే మెగా డీఎస్సీ ప్రక్రియను ప్రారంభిస్తామని.. జూన్‌లోపు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తానని ప్రకటించారు.

మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ..రాష్ట్రంలో దివ్యాంగులకు 6 వేల రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఏపీ సర్కారు పెన్షన్ల కోసం సంవత్సరానికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.

అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుందని, దీంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవచ్చని చెప్పారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తామని తెలిపారు. విశాఖ ఉక్కును గత ప్రభుత్వం దివాలా తీయించిందని చెప్పారు. ప్రజలు సహకరిస్తే రాష్ట్రంలోనీ రహదారులన్నీ పూర్తి చేస్తానని తెలిపారు.

Also Read:హైడ్రాలో మూటల వేట..హెచ్‌సీయూలో కాసుల వేట: కేటీఆర్

- Advertisement -