విమాన సర్వీసులు మొదలయ్యాయి…కానీ..!

125
aai

దేశ‌వ్యాప్తంగా డోమెస్టిక్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత అన్ని విమానాశ్ర‌యాల నుంచి విమాన స‌ర్వీసులు ప్రారంభం అయ్యాయి.

విమాన ప్రయాణానికి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్‌ను ఏఏఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ గైడ్ లైన్స్ ప్రకారమే ప్రయాణీకులను ట్రావెల్ చేసేందుకు అనుమతిస్తున్నారు.

అయితే కొన్ని చోట్ల విమానసర్వీసులను ర‌ద్దు చేశారు. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయరు. టికెట్ బుకింగ్ చేసుకుని ఎయిర్‌పోర్ట్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఫ్ల‌యిట్లు ర‌ద్దు అయిన‌ట్లు సమాచారం ఇవ్వడంపై ప్రయాణీకులు మండిపడుతున్నారు.

ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులు ఎయిర్‌పోర్టుకు వచ్చిన తర్వాత ఫ్లైట్ ్యాన్సిల్ అయిందనే సమాచారం ఇవ్వడంపై వారంతా షాక్‌కు గురయ్యారు. ఇక బెంగళూరులో కూడా ఇలాంటి స‌మ‌స్య త‌లెత్తింది. బెంగుళూరు నుంచి హైద‌రాబాద్‌కు రావాల్సిన విమానాన్ని అక‌స్మాత్తుగా ర‌ద్దు చేశారు.