భారీ రేటుకు ఆర్ఆర్ఆర్…రైట్స్!

193
rrr

దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికవార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్, ఓటిటి రైట్స్ భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుకాగా తాజాగా సినిమా ఆడియో రైట్స్ కు భారీ రేటు పలికినట్లు సమాచారం. బాహుబలి ఆడియో హక్కులను పొందిన లహరి మ్యూజిక్ “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ ను రికార్డు ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ ను ఈ సంస్థ సొంతం చేసుకుందట.

హిందీ ఆడియో రైట్స్ మాత్రం బాలీవుడ్ కు చెందిన ప్రసిద్ధ సంస్థ సొంతం చేసుకుంది. అయితే ఆ అమౌంట్ ఎంత అనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఆర్ఆర్ఆర్ టీం ఫస్ట్ సాంగ్‌ని లాంఛ్ చేయనున్న తరుణంలో భారీ రేటుకు ఆడియోరైట్స్ అమ్ముడయ్యాయనే వార్త ఆసక్తికరంగా మారింది.