సూర్య…నవరస ట్రైలర్

132
navarasa

హీరో సూర్య ప్రధానపాత్రలో తొమ్మిది భావోద్వేగాలు, తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా తెరకెక్కిన చిత్రం నవరస. ఆగస్ట్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ కానుండగా తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

మాన‌వ జీవితంలోని తొమ్మిది ర‌సాలు(భావోద్వేగాలు).. ప్రేమ‌, హాస్యం, కోపం, దుఃఖం, ధైర్యం, భ‌యం, జుగుప్స‌, ఆశ్చ‌ర్య‌పోవ‌డం, శాంతి కలయికతో.. తమిళ సినిమాకు సంబంధించిన అద్భుత‌మైన‌ క్రియేటివ్ పర్సన్స్ అందరూ ఇండియ‌న్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో లార్జర్ దేన్ లైఫ్ మూమెంట్ ఈ అంథాల‌జీని రూపొందించారు.

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మ‌ణిర‌త్నం, జ‌యేంద్ర మాట్లాడుతూ భావోద్వేగాలు క్ష‌ణిక‌మైన‌వే కావ‌చ్చు. అయితే అవి మ‌న జీవితాంతం గుర్తుండిపోతాయి. భావోద్వేగాలు మ‌న జీవితంలో ఓ భాగం. కొన్ని భావోద్వేగాలు అయితే మ‌న గ‌మ‌నాన్నే మార్చేస్తాయని తెలిపారు. సినీ ఇండ‌స్ట్రీలోని మా స‌హ‌చ‌రులు, ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు, సాంకేతిక‌నిపుణులతో భాగ‌మైనందుకు ఆనందంగా, గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాం అన్నారు.

Navarasa | Official Trailer | Mani Ratnam, Jayendra | Netflix India