RRR పై ఆగని ప్రశంసల వర్షం

39
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులు సృష్టించింది. పైగా బెస్ట్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్‌కు అవార్డు కూడా దక్కించుకుంది. దాంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ పై మరో ఇద్దరు హాలీవుడ్ స్టార్స్ పొగడ్తలు కురిపించారు. హాలీవుడ్ హీరో ‘టోబే న్యిగ్యి’ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం రిలీజైన తన సినిమా ‘ట్రాన్స్ ఫార్మ్- రైజ్ ఆఫ్ ది బీస్ట్’ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా టోబే ఈ విధంగా మాట్లాడాడు. ‘నేను కూడా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూశాను. ఆ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది. స్టోరీతో పాటు ఇతర అన్ని ఎలిమెంట్స్ నాకు అద్భుతంగా అనిపించాయి. ఎన్టీఆర్ నటన అద్భుతం. అయితే నాటు నాటు డాన్స్ మాత్రం నేను ట్రై చేయలేను. అది నా వాళ్ళ కాలేదు’ అని నవ్వుతూ చెప్పాడు.

అలాగే, మరో హాలీవుడ్ స్టార్ ‘క్రిస్ హెమ్స్ వర్త్’ కూడా ‘ఆర్ఆర్ఆర్’ పై ప్రశంసలు కురిపించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పై కూడా ఈ హాలీవుడ్ నటుడు పొగడ్తలు కురిపించారు. ‘ఆర్ఆర్ఆర్ సినిమాను ఇటీవల చూశాను. సినిమా అద్భుతంగా అనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతం. అలాగే రామ్ చరణ్ కూడా బాగానే చేశాడు. ఒకవేళ వారితో కలిసి నటించే అదృష్టం నాకు లభిస్తే అది అద్భుతమే’’అని ఓ ఇంటర్వ్యూలో క్రిస్ తెలిపారు. క్రిస్ హెమ్స్ వర్త్ త్వరలో ‘ఎక్స్ ట్రాక్షన్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన సినిమా ప్రమోషన్ లో క్రిస్ పై విధంగా మాట్లాడాడు.

Also Read: ఆఫర్ల కోసం సమంత తంటాలు

మొత్తానికి ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ స్టార్స్ ను కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సినీ ప్రియుల చ‌ర్చల‌న్నీ ఆర్ఆర్ఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి.

Also Read: వరుణ్ – లావణ్య మధ్య ప్రేమ ఎలా పుట్టింది ?

- Advertisement -