హోం క్వారంటైన్..కొత్త మార్గదర్శకాలివే

50
guide lines

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదుకాగా హోం క్వారంటైన్‌కు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్రం. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు రెమిడిసివర్ ఇంజక్షన్‌ వాడకూడదని పేర్కొంది.

ఇక 10 శాతం కన్నా ఎక్కువగా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్ర‌క‌టించింది కేంద్రం. ప్రజలు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని.. భౌతిక దూరం 6 ఫీట్లు పాటించాల‌ని.. శానిటైజ‌ర్లు వాడాల‌ని పేర్కొంది కేంద్రం.

షాపింగ్ మాల్స్, బార్స్, జిమ్ లు,స్పా లు, స్విమ్మింగ్ పూల్స్, హోటల్స్ మూసివేయాల‌ని స్ప‌ష్టం చేయ‌గా.. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు అయిన రైల్వేలు, మెట్రో, బస్సులు, క్యాబ్స్ లో 50 శాతం కెపాసిటీ తో నిర్వ‌హించాల‌ని పేర్కొంది.