భారత్‌తో తమ బంధం బలమైంది: బైడెన్

73
biden

భారత్‌తో తమ బంధం బలమైందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇటీవలే ప్రధాని మోడీతో తాను మాట్లాడానని తెలిపారు. అధ్యక్షుడిగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యక్రమంలో మాట్లాడిన భారత్….వందరోజుల్లో భారత్ తో బలమైన బంధం ఏర్పడిందన్నారు.

అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్, భారత విదేశాంగశాఖ మంత్రి అనేకమార్లు చర్చలు జరిపారని, రెండు దేశాల మధ్య బంధానికి ఇరువురి మధ్య జరిగిన చర్చలు నిదర్శనం అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడిందని, భారత్ కు సహకరిస్తామని తెలిపారు.