వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బీఐ….

56
sbi

కస్టమర్లకు తీపికబురు అందించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). ఈ ఏడాది మార్చి వరకు గృహ రుణాలపై 30 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. దీంతో పాటు అప్పటి వరకు ప్రాసెసింగ్‌ ఫీజు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ వడ్డీ రాయితీ దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రూ.5 కోట్ల వరకు ఉండే గృహ రుణాలకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఎస్బీఐ నుంచి హోమ్‌ లోన్లు తీసుకున్న ఖాతాదారులు యోనో యాప్‌ ద్వారా ప్రీ అప్రూవ్డ్‌ టాప్‌ అప్‌ హోమ్‌ లోన్లు పొందవచ్చు..

ఖాతాదారుల వ్యక్తిగత సిబిల్‌ స్కోర్ ఆధారంగా ఈ రాయితీ వర్తింపజేస్తారు. రూ.30 లక్షల వరకు ఉండే హౌసింగ్ లోన్స్‌పై 6.80 శాతం వడ్డీ, అంతకు మించిన రుణాలపై 6.95 శాతం వడ్డీ వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.. మహిళలకు ఇచ్చే గృహ రుణాలపై అదనంగా మరో 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ లభించనుండగా.. యోనో యాప్‌ ద్వారా అప్లై చేసుకున్నవారికి అదనంగా 5 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు.