రాష్ట్రంలో 24 గంటల్లో 298 కరోనా కేసులు..

12
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయింది. గత 24 గంటల్లో 298 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,433కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 4822 యాక్టివ్ కేసులుండగా 2,83,048 మంది రికవరీ అయ్యారు.

కరోనాతో 1,563 మంది మృతిచెందారు.రాష్ట్రంలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 31,187 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 72,15,785కు చేరాయి.