మోదీ చట్టాలపై సుధీర్ బాబు అసహనం..

83
sudeer babu
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకురాబోతున్న కొత్త సినిమాటోగ్రఫీ చట్టాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే హీరో సూర్య కొత్త సినిమాటోగ్రఫీ చట్టాలపై అసంతృప్తి వ్యక్తం చేయగా తాజాగా హీరో సుధీర్ బాబు సైతం స్పందించారు.

సినిమాటోగ్రాఫ్ (అమెడ్మెంట్) బిల్ 2021 అమల్లోకి వస్తే సినిమా వారిని మరింతగా టార్గెట్ చేసే అవకాశం ఉందని మండిపడ్డారు. రీ సెన్సార్ అనేదే ఉండేటట్లైతే ఇక ‘సీబీఎఫ్సీ’ ఎందుకు?’ అని ప్రశ్నించిన సుధీర్ బాబు..నిజంగా రాజకీయ నాయకులు తాము మాట్లాడే ప్రతీ మాటకీ బాధ్యత వహించాల్సి వస్తే… వారి మీద ఎన్ని క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి? సినిమా వాళ్లు ఇప్పటికే అనేక నియమ, నిబంధనల్ని ఎదుర్కొంటూ తమ పని చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ అజమాయిషీ మంచిది కాదు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛని గౌరవించాలని పేర్కొన్నారు సుధీర్ బాబు.

- Advertisement -