మెహ్రీన్‌తో పెళ్లి రద్దు..స్పందించిన భవ్య బిష్ణోయ్..!

129
mehreen
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్‌ మెహ్రీన్‌ కౌర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అందించిన సంగతి తెలిసిందే. ఇటీవలె హరియాణా మాజీ సీఎం భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్ మెంట్ జరుగగా అది జరిగిన కొద్దిరోజులకే పెళ్లి రద్దు చేసుకున్నానని తెలపడంతో అభిమానులంతా షాక్‌ కు గురైయ్యారు.

దీంతో మెహ్రీన్‌ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో భవ్య బిష్ణోయ్‌పై పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తుండగా వాటికి చెక్ పెట్టారు భవ్య. పెళ్లి రద్దుపై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని…. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు, మా కుటుంబంపై ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు.

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ పంజాబీ భామ. తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్‌ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఎఫ్‌ 3తో పాటు మారుతి దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మెహ్రీన్.

- Advertisement -