కరోనా నన్ను,నా కుటుంబాన్ని భయపెట్టింది: రామ్‌

61
hero ram

కరోనాతో తన కుటుంబం తీవ్రంగా భయపడిపోయిందన్నారు హీరో రామ్ పోతినేని. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్‌…ఈ ఏడాదిలో చెప్పుకోవడానికి అంతగా ఏమీ చేయలేదు. కానీ కొన్ని మంచి చేస్తే, మరి కొన్ని భయాన్ని కలిగించాయని తెలిపారు.

లాక్‌డౌన్ కారణంగా కుటుంబంతో గడపడానికి సమయం దొరికింది. కానీ కరోనా నన్ను చాలా భయపెట్టింది. అమ్మకి, సోదరుడికి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఏమీ అర్థం కాలేదన్నారు. ఇంతలో సోదరుడికి కాస్త సీరియస్ వార్త వినడంతో షాక్‌కు గురయ్యా…డాక్టర్లు చికిత్స చేయడంతో కోలుకున్నారని తెలిపారు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్‌ నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తొలుత సంక్రాంతికి రిలీజ్ కానుందని వార్తలు వచ్చినా సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నారు రామ్‌.