టీమిండియాపై సెహ్వాగ్ సెటైర్లు!

81
sehwag

ఆడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సేన ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలింగ్ ధాటికి భారత ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. అగ్రశ్రేణి ఆటగాళ్లు సైతం కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో కోహ్లీ సేనపై సర్వత్రా విమర్శలు వెలువడుతుండగా భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.

ట్విట్టర్ వేదికగా భారత బ్యాటింగ్ లైనప్‌ని ఓటీపీతో పోలుస్తూ ట్రోల్ చేశాడు. దీనిని ఎవరూ గుర్తుపెట్టుకోవాలని అనుకోరని …ఓటమిని మర్చిపోవడానికి ఓటీపీ ఇదేనంటూ ఆటగాళ్లు చేసిన వ్యక్తిగత స్కోర్లను (49204084041)ను పేర్కొన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 53 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్…రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. ఇక కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో భారత ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.