పెళ్లిపై మరో స్టార్ నుంచి క్లారిటీ

21
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ ఇప్పటికే పుకార్లు జోరుగా సాగుతున్నాయి. స్కూల్ డేస్‌ నుంచే ఓ అమ్మాయితో రామ్‌కు పరిచయం ఉందని.. ఇంతకాలం ఫ్రెండ్స్‌గా కొనసాగిన ఈ జంట, ఇప్పుడు పెళ్లి వైపుగా అడుగు లేస్తున్నార‌ని పుకార్లు పుట్టించారు. అయితే, ఇదే విషయం పై రామ్ టీమ్ ను అప్రోచ్ అయితే.. ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. రామ్ కి ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు అని, ఒకవేళ పెళ్లి పై నిర్ణయం తీసుకుంటే.. రామ్ నే స్వయంగా మీడియాకి తెలియజేస్తాడు అని, దయచేసి అప్పటివరకూ ఎలాంటి రూమర్లను వైరల్ చేయకండి అంటూ రామ్ టీమ్ కోరింది.

కాబట్టి, త్వరలో రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది కేవలం పుకార్లు మాత్రమే. అయినా, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మీ పెళ్లి ఎప్పుడు? అని ఓ యాంకర్ రామ్‌ ని అడిగితే.. మ‌న చేతుల్లో ఏముంటుంది.. పెళ్లి అనేది కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని రామ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి పెళ్లి విషయంలో రామ్ ఏ మాత్రం తొందర పడట్లేదు.

Also Read:షుగర్ పేషెంట్లకు ఈ మొక్క.. అద్బుతవరం!

మే 15, 1988లో రామ్ జన్మించాడు. రామ్ వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. మరి పెళ్లి వయసు దాటిపోయి కూడా నాలుగేళ్లు అవుతుంది. ఈ లెక్కన రామ్ పెళ్లి పై ఎప్పుడు ఆసక్తి చూపిస్తాడో చూడాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ పోతినేని ప్రస్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో త‌న 20వ సినిమాను చేస్తున్నాడు. సినిమాల్లోనే కాకుండా రియ‌ల్ లైఫ్‌లో కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండ్‌ ని ఫాలో అయ్యే రామ్ రీసెంట్‌గా స్టైలిష్ లుక్‌ లో కనిపించి అద‌ర‌గొట్టాడు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌ తో పాటూ న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని పోజులిచ్చిన రామ్ ఫొటో నెట్టింట వైర‌ల్ గా కూడా మారింది. ఇదే లుక్ లోనే రామ, బోయపాటి సినిమాలో కనిపిస్తాడట.

Also Read:‘ఆదిపురుష్’ కు అలహాబాద్ కోర్టు షాక్

- Advertisement -