- Advertisement -
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షంతో ఎండవేడిమి నుండి నగర వాసులకు కాసింత ఊరట లభించింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఎస్సార్‌నగర్, పంజాగుట్ట,ఐడీపీఎల్,జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. వాన పడింది. వర్షం కురిసిన చోట లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఒడిశాలోని పారాదీప్‌కు 1100కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉంది.
- Advertisement -