తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని భూపాలపల్లి ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.
అలగే మెదక్, భద్రాచలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఏపీలోని చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. సత్యసాయి, కర్నూలు, నంద్యాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. కర్నూలులో 40.7, సత్యసాయి జిల్లా కనగానపల్లిలో 40.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని… రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Also Read:మెదక్.. చిక్కిన చిరుత

