బీఆర్ఎస్ పార్టీకి అండగా వరంగల్ ప్రజలు

16
- Advertisement -

వరంగల్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు, స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు అందరూ సహకరించాలని కోరుతున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్వహిస్తున్న సభ ఇది అన్నారు.

సభ విజయవంతంగా జరిగేందుకు అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాం.. అంచనాలకు మించిన జనం రాబోతున్నారు. ప్రభుత్వం, పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తలు పాటించాలి ఓపికతో, స్వీయ క్రమశిక్షణ, సమన్వయంతో ముందుకు వెళ్లాలి అన్నారు.

సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం.. ఏదేమైనా, ప్రపంచం తలకిందులైనా ప్రతి ఒక్కరూ సభకు చేరుకోవాల్సిందేనన్నారు. కేసీఆర్ ప్రసంగం వినాల్సిందే. మరోసారి మన ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రతిన భూనుదాము. అని పిలుపునిచ్చారు హరీశ్‌.

Also Read:హిట్ 3 కోసం అమెరికాకు శ్రీనిధి!

- Advertisement -