రెయిన్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలు!

10
- Advertisement -

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలహీనపడి ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో అనేక చోట్ల మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40కిలో మీటర్ల వేగంతో గాలి వేగం ఉంటుందని తెలిపారు.

రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 42 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.

Also Read:తెలంగాణలో వాహనదారులకు షాక్

- Advertisement -