మరో ఐదు రోజులు భారీ వర్షాలు!

16
- Advertisement -

తెలంగాణలో ఇవాళ.. ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి బెంగాల్ వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి, అదే ప్రాంతం నుంచి కర్ణాటక దాకా ఏర్పడిన మరో ద్రోణి ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏప్రిల్ 16న భాగంగా మేఘావృత ఆకాశం మరియు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, రోడ్లపై నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరించారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని… ఆంధ్రప్రదేశ్‌లో గాలుల వేగం గంటకు 11 కిలోమీటర్లు, తెలంగాణలో 16 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read:సుప్రీంలో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ

- Advertisement -