జీవో 203ని ఉపసంహరించుకోవాలి: గుత్తా

336
gutha sukhender reddy
- Advertisement -

సీఎం కేసీఆర్ ఉండగా కృష్ణ నుంచి చుక్క నీటిని కూడా ఏపీ సర్కారు అక్రమంగా తరలించలేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం శాసన మండలి లోని కమిటీ హాల్ లో మీడియా సమావేశం నిర్వహించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ” కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకనే కృష్ణానది కింద ప్రాజక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు.

హంద్రీనీవా ప్రాజక్టుకు నీరు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి గా పని చేసిన ప్రస్తుత బిజెపి నాయకురాలు హారతులు పట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జీవో నంబర్ 203తో కృష్ణా ఆయుకట్టు ఎడారిలా మారుతోందని ఆయన చెప్పారు.ఉమ్మడి రాష్ట్రానికి ఏపీ, రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండటం వలనే తెలంగాణకు నష్టం కలిగిందని విమర్శించారు.

పోతిరెడ్డిపాడును ప్రస్తుత నల్లగొండ, భువనగిరి ఎంపీలు అప్పట్లో సమర్థించారని గుర్తుచేశారు. కాంట్రాక్టుల కోసం పులిచింతల, పోతిరెడ్డిపాడును సమర్థించిన భువనగిరి ఎంపీ గుండెలపై చేతులు వేసుకుని ఆలోచించాలని గుత్తా అన్నారు.

పోతిరెడ్డిపాడును ఆపే బాధ్యత బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌పై కూడా ఉందని తెలిపారు. ఏపీ విభజన చట్టానికి వ్యతిరేకంగా జగన్ వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.

నీళ్ళు నిధులు నియామకాలపై 14ఏళ్ళ పాటు ఉద్యమాన్ని నడిపిన ఘనత కేసీఆర్‌దే అని చెప్పుకొచ్చారు. 80వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్ళాలనుకోవటం జగన్ దురాశే అని వ్యాఖ్యానించారు. జీవో 203ను ఏపీ ప్రభుత్వం వెంటనేఉపసంహరించుకోవాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -