నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు..

54
- Advertisement -

కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణంతో ప్రజలకు కాస్త రిలీఫ్ ఉండగా ప్రస్తుతం ఆ వాతావరణం మారింది. ప్రచండ భానుడి ఉగ్రరూపంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. ఎండవేడికి తోడు ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటికి రావలంటే జంకుతున్నారు. ఎండల తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓవైపు ఎండ‌లు మండిపోతుండ‌గా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read:KTR: ప్ర‌తిప‌క్షాల మాట‌ల‌కు ఆగం కావొద్దు

ఎండలు తీవ్ర‌మ‌వు‌తున్న నేప‌థ్యంలో ప్రజలు ముందస్తు జాగ్ర‌త్తలు పాటిం‌చా‌లని అధికారులు కోరారు.మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.మద్యాహ్నం వేళ అయితే రోడ్డు మీదకు రావడమంటే ప్రాణాలతో చెలగాటమే.

Also Read:ప్రభాస్ స్టైల్ మార్చాడు

- Advertisement -