పుష్ప… ఫుల్ లిరికల్ వచ్చేసింది

8
- Advertisement -

అదిరిపోయే సంగీతం… మెస్మ‌రైజ్ చేసే విజువ‌ల్స్‌… హైక్లాస్ మేకింగ్‌.. ఊర‌మాస్ స్టెప్స్‌… క్లాప్ కొట్టించే ఐకాన్‌స్టార్ స్వాగ్‌… విన‌గానే వావ్ అనిపించే లిరిక్స్‌.. ఇలా ఒక‌టేమిటి.. పుష్ప‌… పుష్ప‌…పుష్ప.. పుష్ప‌రాజ్.. నువ్వు గ‌డ్డం అట్టా స‌వ‌రిస్తుంటే.. దేశం ద‌ద్ద‌రిలే.. ఈ పాట వింటూంటే అంద‌రికి గూజ్‌బంప్స్‌.

ఇక ఐకాన్‌స్టార్ అభిమానుల సంబరం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. ఎస్‌… అంద‌రూ ఎంతో ఎదురుచూస్తున్న పుష్ప‌-2 ది రూల్ లోని తొలి లిరిక‌ల్ వీడియో వ‌స్తున్న అప్లాజ్ అది.. పుష్ప‌… పుష్ప‌…పుష్ప.. పుష్ప‌రాజ్.. నువ్వు గ‌డ్డం అట్టా స‌వ‌రిస్తుంటే.. దేశం ద‌ద్ద‌రిలే.. అనే లిరిక‌ల్ వీడియోను బుధ‌వారం విడుద‌ల చేశారు మేక‌ర్స్‌… చంద్ర‌బోస్ లిరిక్స్ అందించిన ఈ పాట హై మాసివ్‌గా పూర్తి క‌మ‌ర్షియ‌ల్‌గా సాంగ్‌గా వుంది. చిత్రంలో పుష్ప ది రూల్‌ను ఎలివేట్ చేసే విధంగా, పుష్ప క్యారెక్ట‌రైజేష‌న్ మీద సాంగ్ వుంది. విన‌గానే అంద‌రికి ఈ పాట ఎంతో న‌చ్చే విధంగా వుంది.

విజ‌య్ పొల్లంకి, శ్రేష్టి వ‌ర్మ కొరియోగ్ర‌ఫీ అందించిన ఈ పాట‌ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా విడుద‌ల చేశారు. తాజాగా వ‌దిలిన ఈ పాట‌తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబ‌రాల్లో వున్నారు. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

Also Read:తాటి ముంజలు తింటే ఎన్ని లాభాలో!

- Advertisement -