హ్యాపీ బర్త్ డే..రౌడీ బాయ్ విజయ్

53
- Advertisement -

విజయ్ దేవరకొండ…టాలీవుడ్ సెన్సేషన్ . పెళ్లి చూపులు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డితో యూత్‌ని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

మే 9, 1989న జన్మించారు విజయ్. ఇంటర్మీడియట్ విద్యను లిటిల్ ప్లవర్ జూనియర్ కాలేజ్ లో చేయగా.. డిగ్రీని బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ లో చదివారు. విజయ్ మొదటగా నువ్విలా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Also Read:Chiranjeevi:మెగాస్టార్‌ కి ఐటమ్ భామ కావాలి

ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టీస్ట్ గా చేశాడు. 2015లో వచ్చిన ఎవడే సుబ్రమ్మణ్యం సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈమూవీ తర్వాత తరుణ్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈమూవీ ఘన విజయం సాధించడంతో ఆయనకు మంచి పేరును తీసుకువచ్చింది. ఈమూవీ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

Also Read:మేమ్ ఫేమస్..థియేట్రికల్ రిలీజ్

దీంతో విజయ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే అప్పటి వరకూ మాస్ ప్రేక్షకులను మాత్రమే అలరించిన విజయ్ గీతా గోవిందం సినిమాతో క్లాస్ ఆడియన్స్ ను అలరించాడు. ఆ తర్వాత ఆయన నటించిన ట్యాక్సివాలా మూవీ మరో రికార్డు క్రియేట్ చేసింది.

- Advertisement -