Chiranjeevi:మెగాస్టార్‌ కి ఐటమ్ భామ కావాలి

64
- Advertisement -

తెలుగు సీనియర్ హీరోలకు ఎప్పుడూ హీరోయిన్ల సమస్య వస్తుంటుంది. ఈ లిస్ట్ లో ముఖ్యంగా బాలయ్య పేరు ముందువరుసలో ఉంటుంది. ఆ తర్వాత వెంకీ, మెగాస్టార్ చిరంజీవిలకు కూడా ఈ సమస్య ఉంది. కానీ, ఈసారి ఐటమ్ గర్ల్ సమస్య వచ్చింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవికి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో రాబోతున్న భోళా శంకర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. డింపుల్ హయాతితో ఈ ఐటమ్ సాంగ్ ని చేయిస్తే.. బాగుంటుందని చిరంజీవినే స్వయంగా దర్శకుడు మెహర్ రమేష్ కి సూచించినట్లు తెలుస్తోంది.

డింపుల్ హయాతి రీసెంట్ గా రామబాణం సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె లుక్స్ పై విమర్శలు వినిపించాయి. పైగా ఆమెకు నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఉంది. ఇక ఇప్పటికే తాను చేసిన సినిమాల్లో డింపుల్ హయాతి అన్ని భంగిమలలో తన అందాలన్నీ ఆల్ మోస్ట్ తెరపైనే చూపించేసింది డింపుల్. కాబట్టి, భోళా శంకర్ సినిమాకు గ్లామర్ టచ్ బాగుంటుందనో, డింపుల్ తో ఐటమ్ సాంగ్ చేయించమని మెగాస్టార్ చెప్పారు.

Also Read:లింగాయత్ లు బీజేపీకి షాక్ ఇస్తారా?

కానీ తాను ఐటమ్ సాంగ్ లు చేయనని, మంచి పాత్ర అయితేనే చేస్తానని డింపుల్ ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో దర్శకుడు మెహర్ రమేష్ డీలా పడి, మొత్తానికి అసలు విషయాన్ని మెగాస్టార్ కి పాస్ చేశాడు. సరే.. డింపుల్ హయాతి రేంజ్ లో మరో భామను ఫైనల్ చేయమని మెగాస్టార్ చెప్పారు. మరి మెహర్ రమేష్, డింపుల్ హయాతి రేంజ్ భామను పట్టుకొస్తాడో లేదో చూడాలి.

Also Read:ఆదిపురుష్ ట్రైలర్ కి టైమ్ లాక్

- Advertisement -