తండ్రైన భారత ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా..

110
hardik

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ నటాషా స్టాంకోవిక్ పండంటి మగబిడ్డ జన్మనించ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు పాండ్యా. తన కొడుకు చేతిని పట్టుకొని దిగ్గిన ఫోటోను షేర్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు పాండ్యా.

దీంతో సోషల్ మీడియాలో పాండ్యాకు పలువుకు శుభాకాంక్షలు తెలిపారు. కెఎల్ రాహుల్, క్రిస్ లిన్ మరియు సానియా మీర్జా, హర్దిక్ పాండ్యా నటాసా స్టాంకోవిక్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

వెన్నెముక చికిత్స కారణంగా పాండ్యా గత సంవత్సర కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. భారత ఆల్ ‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జనవరి 1న సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి కాకముందే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.