సింగరేణిలో మరో 30 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం…

276
sccl
- Advertisement -

సింగరేణి సంస్థ తలపెట్టిన 300 మెగావాట్స్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం లో భాగంగా తొలిదశలో గల మణుగూరు 30 మెగావాట్ల సోలార్ ప్లాంట్ సింక్రనైజేషన్ ప్రక్రియ గురువారం నాడు ( జూలై 30)న విజయవంతం గా జరిగిందని సింగరేణి చైర్మన్ అండ్ ఎండి శ్రీఎన్. శ్రీధర్ తెలియజేశారు.
తాము తొలిదశలో నిర్మించతలపెట్టిన 129 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్దగల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించామని, ఇప్పుడు మణుగూరు ప్లాంట్ కూడా ప్రారంభించడంతో మొత్తం 40మెగా వాట్స్ విద్యుత్తు రాష్ట్ర గ్రిడ్ కు సరఫరా చేస్తున్నట్లు అవుతుందని తెలిపారు.

తొలిదశలో గల మిగిలిన రెండింటిలో రామగుండం 3 ఏరియా లోని 50 మెగావాట్ల ప్లాంట్ ,ఇల్లందు ఏరియాలోని 30 మెగావాట్ల ప్లాంట్లు కూడా మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నామని తెలిపారు. కరొన పరిస్థితుల వలన నిర్మాణం కొంత మందగించి నప్పటికీ, తగు జాగ్రత్త లతో మణుగూరు ప్లాంటు పూర్తి చేశామని పేర్కొన్నారు

మణుగూరు ప్లాంట్ వివరాలు

మణుగూరు ఏరియా లో పాత మణుగూరు గ్రామానికి సమీపంలో 150 ఎకరాలవిస్తీర్ణంలో సుమారు 125 కొట్లరూపాయల వ్యయం తో ఈ 30 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఒక లక్ష సోలార్ ప్యానల్స్ ను ప్లాంట్ లో ఏర్పాటు చేశారు . ఈ ప్లాంట్ నిర్మాణం పనులను చైర్మన్ శ్రీధర్ ఆదేశంపై డైరెక్టర్ (ఈ అండ్ ఎం )శ్రీ ఎస్. శంకర్ స్వయంగా పర్యవేక్షించారు.

ప్రముఖ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది .ఇక్కడ ఉత్పత్తి అయ్యే 30 మెగావాట్ల విద్యుత్తును స్థానిక 220 కేవీ సబ్ స్టేషన్ కి సరఫరా చేసి గ్రిడ్ కు అనుసంధానం చేయడానికి ప్లాంటు లో ప్రత్యేక సబ్ స్టేషన్ నిర్మించారు.ఇక్కడ జరిగే సోలార్ విద్యుత్ ఉత్పత్తి వలన కంపెనీకి ఏడాదికి 11 కోట్ల రూపాయిలు ఆదా కానున్నాయి.

ఈ ఏడాది చివరికల్లా రెండు , మూడు దశలు పూర్తి.

ఇదిలా ఉంటే సింగరేణి సంస్థ రెండవ దశలో నిర్మించతలపెట్టిన 90 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లని భూపాలపల్లి (10. మె.వా), మందమర్రి బెల్లంపల్లి(43 మె.వా), కొత్తగూడెం లో 37 ,మెగావాట్ల ప్లాంటు లు ఏర్పాటు చేయడానికి ప్రముఖ అదాని కంపెనీకి కాంట్రాక్టు అప్పగించడం జరిగింది.భూపాలపల్లిలో ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైంది .ఈ ఏడాది చివరికి మిగిలిన చోట్ల కూడా నిర్మాణం పూర్తి కానుంది.

కాగా మూడవ దశ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కూడా యాజమాన్యం కసరత్తు పూర్తి చేసింది .ఈ దశలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జలాశయం నీటి మీద , డోర్లి ఓపెన్ కాస్ట్ క్వారీ నీళ్ళమీద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ లనునిర్మించనున్నారు .త్వరలోనే మూడవ దశ కు సంబంధించి కూడా టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్ ను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు .

సాగునీటి జలాశయాల మీద మరో 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ప్రతిపాదన.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో గల భారీ జలాశయాల నీళ్లపై తేలియాడే 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా యాజమాన్యం ముందుకు వచ్చింది.రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో ఈ విషయంపై పై ఒక నివేదికను రూపొందించింది .ఈ నివేదికను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి అనుమతులు కోరనున్నారు.ప్రభుత్వ అనుమతి తో పాటు విద్యుత్ అమ్మకానికి కు కూడా ఒప్పందం కుదిరితే వీటిని నిర్మించడానికి కూడా సింగరేణి సంసిద్దమయి ఉంది.ఆ విధంగా మొత్తం 800 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అందించడానికి సింగరేణి ప్రయత్నిస్తోందని సి & ఎం. డి శ్రీ ఎన్ శ్రీదర్ తెలియజేశారు .మణుగూరు లో జరిగిన సింక్రనేజేషం కార్యక్రమాన్ని డైరెక్టర్ ఈ ఎం ఎం శ్రీ ఎస్ శంకర్ కొత్తగూడెం నుండి పర్యవేక్షించారు. మణుగూరు జిఎం శ్రీ జే రమేష్ ,ఏరియా ఇంజనీర్ ఫిజ రాల్డ్ జిమ్ (సోలార్ , )ప్రసాదరావు, శ్రీ నర్సిరెడ్డి,Dy.GM(E&M) కన్సల్టెంట్ మురళీధరన్ ,బి హెచ్ ఈ ఎల్ఏ నుండి ఏ జి యం శ్రీ బన్వల్కర్ ,డీజీఎం నవీన్ కుమార్ , ట్రాన్స్కో ఎస్.ఈ. శ్రీనివాసరావు , పాల్గొన్నారు.

- Advertisement -