బ్యాంకుల అమ్మకం…కేంద్ర వైఫల్యానికి నిదర్శనం

159
gutha
- Advertisement -

రూ.16 లక్షల కోట్ల లాభాల్లో వున్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దుర్మార్గపు విధానాలతో దేశాన్ని అంబానీలకు, ఆదానిలకు అమ్ముతున్నాదని దుయ్యబట్టారు. జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే విధానాలను బీజేపీ ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలకు నవ్వు వస్తుందన్నారు. దిగజారి రాజకీయాలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడిని ప్రజలు త్వరలోనే బహిష్కరిస్తారని హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణగా మారుస్తున్నారన్నారు. కేసీఆర్‌పై అనవసర విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరులేని విజయం సాధించిందని, దీనిద్వారా సీఎం కేసీఆర్‌పై ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో ఉన్న విశ్వసం మరో సారి రుజువైందన్నారు. నల్లగొండలో కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రతి ఒక్కరికి గుత్తా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -